Kalki 2898AD Movie Review & Rating: రేపటి సినిమా కల్కి రివ్యూ !

Kalki Movie review by 18fms 3 e1719510045326

చిత్రం: కల్కి 2898 AD 

విడుదల తేదీ : జూన్ 21, 2024,

నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి..,
అన్నా బెన్ తదితరులు,

దర్శకుడు: నాగ్ అశ్విన్,

నిర్మాతలు : అశ్వనీ దత్,

సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్,

సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్,

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,

మూవీ: కల్కి 2898 AD రివ్యూ  ( Kalki 2898AD Movie Review) 

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మక 50 వ చిత్రం,  ప్రభాస్‌ కథానాయకుడిగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలలలో  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ తో ప్రపంచ సినిమా గా రూపొందిన  ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ముందే భారీ ఆంచనాలు ఏర్పడ్డాయి.

భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. మరి ఈ సైన్స్ ఫిక్షన్ తో కుడికున్న భవిష్యూత్ కధ తో నిర్మించిన ఈ కల్కి చిత్రం ప్రపంచ వ్యాప్త  ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేసిందో మా  18F మూవీస్ టీం  సమీక్ష చదివి తెలుసుకొందమా !

Kalki Movie review by 18fms 6

కధ పరిశీలిస్తే (Story Line): 

భవిష్యత్‌ లో అంటే 2898 వ సంవత్సరం లో ప్రపంచ నగరాలన్నీ మానవులకు అవసరమగు వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో అందరూ  కాశీ పట్టణం చేరుకొంటుంటారు. అక్కడ సుప్రీం యాస్కిన్‌ (కమల్‌హాసన్‌) భూమికి కొంచెం ఎత్తులో  ఒక కాంప్లెక్స్‌ అనే అద్భుత లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని తన అనుచరులతో పాలిస్తూ ఉంటాడు.

కాంప్లెక్స్‌ కింద భూమి మీద ప్రజలు సరైన వసతులు తిండి లేక కష్ట పడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవ (ప్రభాస్)కి కాంప్లెక్స్‌ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 వేల సంవత్సరాల తర్వాత కల్కి (దేవుడు) రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్‌ మనుషులకు అర్ధం అవుతుంది.

కల్కి (దేవుడి అవతారం) పుట్టకుండా మరియు సుప్రీం ఆయుస్సు పెంచుటకు, కాంప్లెక్స్‌లో కొందరు అమ్మాయిలను ఒక ప్రయోగశాలలో భందించి,  ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా గర్భం దాల్చేలా చేస్తారు. తర్వాత గర్భం నుంచి సీరం సేకరించి సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) దగ్గరకు తీసుకు వెళ్తే తను అది తన బాడీ లోకి డంప్ చేసుకొంటూ ఉంటాడు. దీనికి ‘ప్రాజెక్ట్ కె’ అని పేరు పెడతారు.

‘ప్రాజెక్ట్ కె’లో గర్భం దాల్చిన ఏ అమ్మాయి వంద రోజుల కంటే ఎక్కువ బతకదు. అయితే SUM30  సుమతి (దీపికా పదుకోన్) ఐదు నెలల గర్భవతి గా ఉంటుంది. ఆమె నుంచి సీరం సేకరించే సమయంలో కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది. సుమతిని తీసుకు వచ్చేవారికి భారీ బౌంటీ ప్రకటిస్తారు. యూనిట్స్ (డబ్బులు) ఎక్కువ వస్తే  కాంప్లెక్స్‌లోకి ఎంట్రీ పొందవచ్చు అని భైరవ బుజ్జి సహాయం తో బయలు దేరతాడు.

సుమతిని ఆ కాంప్లెక్స్ నుండి తప్పించినది ఎవరు?

సుప్రీమ్ యాస్కిన్ ప్రాజెక్టు- K ప్రయోగాల ప్లాన్ ఏంటి?,

కాంప్లెక్స్ పాలనను వ్యతిరేకిస్తూ ఉన్న సంభల ఎక్కడ ఉంది?, 

అక్కడి మనుషులు కాంప్లెక్స్ పాలనకు రెబల్స్ గా  ఎందుకు మారారు?,

కల్కి (దేవుడు అవతారం) ఎవరు?, కల్కి కి సంభల ప్రజలకు మద్య సంభందం ఏమిటి ?,

 సుమతి  కడుపులోని బిడ్డ (దేవుడు) ని కాపాడటానికి వచ్చిన అశ్వత్థామ ఎవరు ?,

అసలు అశ్వత్థామ ఎవరు ? ఎందుకు సుమతీ ని కపడుతాడు ?,

బౌంటీ ఫైట్స్ చేస్తున్న భైరవ ఎవరు ?, మంచోడా ? చెడ్డ వాడా ?, 

చివరకి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా? లేదా ?

అనే ప్రశ్నలు ఇంటరెస్ట్ గా ఉండి వాటికి జవాబులు తెలుసుకోవాలి అంటే వెంటనే మీ దగ్గరలొని సినిమా దియేటర్ కి వెళ్ళి కల్కి సినిమా చూసేయండి.

Kalki Movie review by 18fms 4

కధనం పరిశీలిస్తే (Screen – Play):

‘కల్కి 2898 ఏడీ’ కథా  పరంగా మంచి డెప్త్ ఉన్నా, పాత్రల పరిశరాల  పరిచేయనికి మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో కొన్ని సన్నివేశాల కధనం స్లాగా సాగినా రెండవ అంకం (సెకండ్ ఆఫ్) నుండి స్క్రీన్ – ప్లే అద్భుతంగా సాగింది.

కధ లొని మెయిన్ ప్లాట్ లోని ప్రధాన పాత్రల మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని సీన్స్ అయితే మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది.

అదేవిధంగా ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఇంకా పెంచి ఉంటే బాగుండేది.  భైరవ పాత్రను మొదటి అంకం లో చాలా తక్కువగా చూపించి క్లైమాక్స్ లో మాత్రం గుస్బామ్స్ వచ్చేలా డిజైన్ చేయడం బాగుంది. ఓవరాల్ గా స్క్రీన్ – ప్లే రొటీన్ గా సాగినట్టు ఉంది.

Kalki Movie review by 18fms 1

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ  ‘కల్కి’ కథ మూడు ప్రపంచాల మధ్య, మొదటిది భవిష్యత్‌ లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించిన విధానం అదే విధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను రెండవ ప్రపంచం గా  చూపించిన విధానం చాలా బాగుంది.

Kalki Movie review by 18fms 10 e1719510258153

ఇక మూడవ ప్రపంచంగా అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండే కాంప్లెక్స్‌ను వండర్ ఫుల్ గా డిజైన్‌ చేసి చూపించారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్ తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారు.

అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ తన యాక్షన్ తో అదరగొట్టారు.

ముఖ్యంగా కమల్‌ హాసన్‌ సుప్రీం యాస్కిన్‌ పాత్ర చిన్నదే అయినా చూపించిన లుక్‌ చాలా బాగుంది. మరియు రెండవ భాగం కోసం ఎదురుచూసేలా ఎండ్ షాట్స్ బాగున్నాయి.

ప్రభాస్  భైరవ పాత్రలోని షేడ్స్ ను చాలా బాగా పలికించాడు. తన భైరవ పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ప్రభాస్ ఉన్న ప్రతి సీన్ లో హాస్యం తో చక్కటి టైమింగ్ తో ఆకట్టుకొన్నాడు. ఇక ప్రభాస్ – అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి.

దీపికా పదుకొనే కి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుడ్ని కనే అమ్మగా అలరించింది.

నటి శోభన మరియమ్ పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే, దిశా పటానీ, పశుపతి, అన్నా బెన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Kalki Movie review by 18fms 7

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్వనీ దత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు నాగ్ అశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు.

Kalki Movie review by 18fms 5

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఈ చిత్ర కధ ద్వాపర యుగం లొని కురీక్షేత్ర యుద్దం తో ప్రారంభమై కలియుగ అంతనికి చేరుకొన్నట్టు  పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబడటం, అలాగే ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు తో అద్భుతంగా రూపొందహించిన దర్శకుడు నాగ అశ్విన్ కి ప్రత్యేక అభినందనలు చెప్పవచ్చు.

ఇలాంటి అద్భుత  పురాణాలు – భవిష్యత్‌ ని సైన్స్ ఫిక్షన్ తో కలిపి తీసిన  ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కథా నేపథ్యంలో డెప్త్ ఉన్నా.. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లాగా సాగటం వలన కొంతమంది ప్రేక్షకులలో డల్ నెస్ అనిపించినా ప్రభాస్ కనపడ్డ ప్రతి సీన్ లోను హాస్య చతురత తో ప్రేక్షకులను  మెప్పించారు.

అలాగే మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా 81 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ ఈ సినిమా తో తనలోని నటుడు ఇంకా ఆకలిగానే ఉన్నాడు అని అశ్వత్థామ గా నటించి చూపించారు.

Kalki Movie review by 18fms

చివరి మాట: రేపటి తెలుగు సినిమా ప్రపంచం కోసం !

18F RATING: 3.75  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *