షైన్ స్క్రీన్స్ నిర్మాణం లో మాస్ కా దాస్ లైలా లుక్  ఆవిష్కరణ!  ప్రేమికుల రోజు దియేటర్ లో కనిపించనున్న లైలా !

laila movie opening 2 e1719994542161

మాస్ కా దాస్ ని లైలా గా చూపించడం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన మరియు సాహసోపేతమైన చర్య అని చెప్పవచ్చు. ఈ తరం హీరోలెవరూ లేడీగా కనిపించలేదు నటించలేదు. అయితే, విభిన్న కధా చిత్రాలను ఎన్నుకొంటూ, విభిన్న పాత్రలలో నటిస్తూ కొత్తగా ప్రయత్నిస్తున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్ తో  షైన్ స్క్రీన్స్ యొక్క సాహు గారపాటి లైలా అనే చిత్ర నిర్మిస్తున్నారు అని ముందే తెలిసిన వార్తే.

ఆ లైలా చిత్రానికి సంభందించి ఈ రోజు మొదటి లుక్ విడుదల మరియు పూజ కార్యక్రమం హైదరాబాద్ లొని అన్నపూర్ణ స్టూడియో లో నిర్వహించారు.

laila movie opening 5

ఈ లైలా చిత్రంలో విశ్వక్ పురుషుడు మరియు స్త్రీగా కనిపించనున్నాడు. దర్శకుడు రామ్ నారాయణ్ విశ్వక్సేన్‌ను లైలా గా  రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  మునుపెన్నడూ లేని పాత్రలో చూయిపించడానికి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఇటువంటి వైవిద్యమైన, ధైర్యమైన మరియు కఠినమైన పాత్రను అంగీకరించడం శారీరకంగా మరియు మానసికంగా చాలా సవాలుతో కూడుకున్నది.

 

 లైలాగా విశ్వక్ సేన్ తన అందచందాలతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించానున్నారో చూడాలి. ఈ రోజు ఆవిష్కరించబడిన ఫస్ట్ లుక్ చూస్తే,  విశ్వక్సేన్‌కి ఇది అందమైన మేక్ఓవర్ అనిపిస్తుంది. అతను సరిగ్గా స్త్రీలా కనిపించడం వల్ల లుక్ అద్భుతంగా ఉంది. ఫిమేల్ గెటప్‌లో విశ్వక్‌లా మరే నటుడు కనిపించి ఉండరనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు ఆయన ఎంతవరకు సూట్ అయ్యాడో ఆ కళ్లను చూస్తేనే అర్థమవుతుంది.

laila movie opening 1

ఈ లైలా సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ను కొట్టగా, దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలు వెంకట సతీష్ కిలారు మరియు జెమినీ కిరణ్ ప్రొడ్యూసర్ కి అందజేశారు.

laila movie opening

అత్యాధునిక సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో రూపొందనున్న ఈ సినిమాతో ఆకాంక్ష శర్మ కథానాయికగా పరిచయం అవుతోంది. లైలా సినిమా కోసం ప్రముఖ సాంకేతిక నిపుణుల బృందం పని చేయనుంది. డి ఓ పి గా రిచర్డ్ ప్రసాద్, వాసుదేవ మూర్తి రచయితగా, తనిష్క్ బాగ్చి, గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి కళా దర్శకుడుగా చేయబోతున్నారు.

laila movie opening 4

విశ్వక్ సేన్ లైలా గా ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14న  ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

తారాగణం:

విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: షైన్ స్క్రీన్స్, నిర్మాత: సాహు గారపాటి, దర్శకుడు: రామ్ నారాయణ్,
రచయిత: వాసుదేవ మూర్తి, సంగీత దర్శకులు: తనిష్క్ బాగ్చి, జిబ్రాన్, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎడిటర్: అన్వర్ అలీ, పిఆర్ ఓ: వంశీ-శేఖర్, మార్కెటింగ్: ఫస్ట్ షో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *