దర్శకుడు తేజ ఆవిష్కరించిన ” పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టైటిల్ లోగో !

Heccharika tittle logo 1 e1718767161610

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై
బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న ” పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్ డైరెక్టర్ తేజ మంగళవారం రోజున ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ :- ఏ సినిమా కైన ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని, ఈ “పోలీస్ వారి హెచ్చరిక” అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన మాస్ టైటిల్ అని , ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారం గా
మారి విజయాన్ని చేకూరుస్తుందని ” పేర్కొన్నారు.

police Heccharika tittle logo

నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ :- ” విజయాలను సెంటిమెంట్ గా మలుచుకున్న సక్సెస్ ఫుల్
దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని పేర్కొన్నారు.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ :- సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని  తెలిపారు.

నటి నటులు : 

సన్నీ అఖిల్ , అజయ్ ఘోష్ , రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం తదితరులు ఈ చిత్ర తారాగణం …,

సాంకేతిక వర్గం : 

కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు , ఎడిటర్ : శర్వాణి శివ , పబ్లిసిటీ & స్టిల్స్ : శ్రీకాంత్ భోక్రె
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్ . పి . సుబ్బరాయుడు , నిర్మాత : బెల్లి జనార్థన్ ,రచన ,దర్శకత్వం : బాబ్జీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *