కళావేదిక, రాఘవి మీడియా – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విశిష్ట అతిథి !

ntr awards scaled e1719330992453

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్  నందమూరి  తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 , హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.

ntr awards 2

“కళావేదిక” (ఆర్ .వి.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును . ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ntr awards 1 scaled e1719331037244

ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు.

కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, యన్టిఆర్  అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *