మా ఫ్యామిలీపై ట్రోల్స్ వెనుక ఉన్న ప్రముఖ హీరో ని పట్టుకోవడానికి ఎంతకైనా రెడీ అంటున్న మంచు విష్ణు ఆరోపణలు

vm 3

కంచు కంటమ్ మంచు మోహన్ బాబు నట వారసుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్న హీరో విష్ణు మంచు. గత కొద్దికాలంగా ప్రేక్షకులను మెప్పించేందుకు విభిన్నమైన పాత్రలతో ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రేక్షకులకు నటనతో ఏమాత్రం దగ్గర అయ్యాడో తెలియదు కానీ, ప్రతిరోజూ, ప్రతి సారీ సోషల్ మీడియా ట్రోలర్శ్ దృస్తి లో పడుతూ అందరికీ నవ్వులు పంచుతున్నారు ..

ఇప్పుడు జిన్నా గా మారి  శృంగార తార ,రొమాంటిక్ తార తో కలసి సిల్వర్ స్క్రీన్ మీద  నవ్వుల అనుభూతిని పంచేందుకు జిన్నా అనే వెరైటీ టైటిల్ తో సిద్దమయ్యారు.

సన్నీ లియోన్ 1 1జిన్నా పాయల్

విష్ణు మంచు, సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్ గా నటించిన జిన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయర్స్‌తో సమావేశమయ్యారు విష్ణు.

ఆ సమావేశం లో పాల్గొన్న మా 18fms.com ప్రతినిది తో ప్రత్యేకంగా  మాట్లాడుతూ …

vm 2

ప్రస్తుత సోషల్  మీడియా గురించి అడగ్గా: ప్రముఖ  సినీ తారలను టార్గెట్ చేస్తూ  కాలానికి తగినట్టుగా మారిన పరిస్థితుల్లో మీడియా కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రస్తుతం యూట్యూబ్‌ కూడా ప్రధాన మీడియాగా మారింది. అయితే ప్రభావవంతంగా మారిన యూట్యూబ్ మీడియా నా ఫ్యామిలీని, సినీ తారల కుటుంబాలను టార్గెట్ చేస్తున్నది.

 

అవాస్తవాలను, నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. దాని వల్ల ఫ్యామిలీలు ఎంత బాధపడుతాయో అర్ధం చేసుకోవాలి అని మంచు విష్ణు అన్నారు.

vm 1

ప్రస్తుతానికి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసులు పెట్టరా? 

సినీ కుటుంబాలను టార్గెట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దాదాపు గా  18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కోర్టులలో  కేసులు నమోదు చేయబోతున్నాం. ఈ విషయంలో మేము ఎంతవరకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నాం. ప్రతీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. మా సంస్థ యూట్యూబ్ నిర్వాహకులతో కూడా మాట్లాడుతున్నాం. కేంద్ర సమాచార, ప్రసారశాఖతో మాట్లాడుతున్నాం. వాస్తవాలను వక్రీకరించారనే కారణంతో కేంద్ర ప్రభుత్వం  తప్పుడు కధనాలు ఇస్తున్న 18 ఛానెల్స్‌ను తొలగించింది అని విష్ణు మంచు చెప్పారు.

జిన్నా
మంచు ఫామిలినే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ? 

గ్లామర్ తో పాటు ఫన్  చేసినా సినీ తారలందరూ అద్దాల మేడలో బతుకుతుంటారు. వారి జీవితం అందరి ముందు స్పష్టంగా ఉంటుంది. అలాంటి సినీ తారల జీవితాల గురించి ఊహించుకొని కథనాలు ప్రసారం చేయడం, వీడియోలు జనరేట్ చేయడం తప్పగా భావిస్తున్నాం. సినిమా పరంగా, వ్యక్తిగతంగా మమ్మల్ని కామెంట్ చేయండి. వాస్తవాలతో మమ్మల్ని ట్రోల్ చేయండి. మాపై ఫన్ క్రియేట్ చేసినా భరిస్తాం. కానీ సంబంధమ్ లేని మా ఫ్యామిలీలను మాత్రం టార్గెట్ చేయవద్దు అని విన్నవించుకొంటున్నాను.

vm 2 1

ట్రోలింగ్ వెనుక ఎవరి ప్రమేయమైన ఉంది అనుకొంటున్నారా ?

ట్రోలింగ్ వెనుక ప్రముఖ హీరో ఐటీ కంపెనీ ఉంది.  మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న ఆ  యూట్యూబ్ కంపెనీని ఐపి నెంబర్ ని గుర్తించాం. జూబ్లీ హిల్స్‌ అడ్రసు లో ఉన్న  ఐటీ కంపెనీ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నది అన్నది ప్రదిమిక సమాచారం. ఇంకా  21 మంది ఉద్యోగులు కలిగి ఉన్న ఐటీ కంపెనీ మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నది. మమ్మల్ని, మా ఫ్యామిలీని వేధిసున్నది. మా ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి  మాకు వారి ఐపీ అడ్రస్‌లను అందజేసినారు. ఓ ప్రముఖ నటుడు ఆఫీస్ ఐడీ నుంచి మాపై దుష్ప్రచారం చేస్తున్నట్టు గుర్తించాం అని విష్ణు మంచు తెలిపారు.

జిన్నా 1

ఆ ఐటి కంపనీ మీద ఇంకా ఎందుకు చర్యలు తెసుకోలేదు ??

యూట్యూబ్‌ ట్రోలింగ్ ద్వారా  సినీ తారలను, వారి కుటుంబాలను వేధిస్తున్న 18 యూట్యూబ్ ఛానెల్స్‌ను గుర్తించాం. గురువారం వారిపై కోర్టులోకేసు నమోదు చేస్తున్నాం. ఆ ఛానెల్స్‌ను మూయించేందుకు రెడీ అవుతున్నాం. త్వరలోనే అందరి బండారాలను బయటపెడుతాం అని విష్ణు మంచు అన్నారు.

ఇంకా జిన్నా సినిమా రిలీజ్ లో ఉన్న గందరగోళం గురించి అడగ్గా మరో సారీ జిన్నా సినిమా ప్రమోసన్స్ లో కలుద్దాం అని మరో చానెల్ ప్రతినిధి తో మాట్లాడుతూ వెళ్లిపోయారు మంచు విష్ణు ..

సొ త్వరలోనే ఆ ప్రముఖ హీరో పేరు బయటికి వస్తుంది అని ఎదురు చూద్దాం ..

ఇట్లు,

కృష్ణా ప్రగడ,

18 ఫిల్మ్స్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *