తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చాయి. అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంటాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి.
ఈ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. వారిలో హాట్ బ్యూటీ లహరి షారి ఒకరు
అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి షారి.. అంతగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది.
కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో తర్వాత ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే లహరి షారి మోడల్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది.
అప్పుడే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 2014లో ‘సారీ నాకు పెళ్లైంది’ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసింది.
బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకున్న లహరి షారి.. మధ్యలోనే ఎలిమినేట్ అయినా గతంలో కంటే క్రేజ్‌ను బాగా పెంచుకుంది.
దీంతో ఇప్పుడు టాలీవుడ్లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది.