సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి బుధవారం రోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల చాలామంది సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
సినీ ప్రముకులందరూ , ఉదయం నుండి పద్మాలయ స్టూడియో వద్ద ఇందిరా దేవికి ప్రత్యేకంగా నివాళులర్పించగా ఆ తర్వాత ఆమె అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను కొనసాగించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తల్లికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే….
మహేష్ బాబు కూతురు సితార కంటతడి:
తల్లి మృతి చెందడంతో మహేష్ బాబు తట్టుకోలేక తన తండ్రిని పట్టుకొని కొద్దిసేపటి వరకు అలానే ఏడ్చాడు. ఇక మహేష్ బాబు తల్లిని ఎంతగానో ఇష్టపడే సితార కూడా వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫాన్స్ ను కూడా కంటతడి పెట్టించాయి.
మొదట కుటుంబ సభ్యులు సన్నిహితులను సందర్శించడానికి ఇందిరా దేవి పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు.
మహేష్ బాబు కన్నీటి పర్యంతం:
ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు ఇందిరా దేవి హఠాత్తుగా మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ముఖ్యంగా తల్లిని ఎంతగానో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మహేష్ బాబు ఈ వార్తను తట్టుకోలేకపోయాడు.
గతంలోనే తన తల్లి గురించి చాలా గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయినా మహేష్ ఇప్పుడు ఆమె ఇక లేరు అనే భాధతో కంటతడి పెట్టుకున్నాడు.
అంతమయాత్ర తర్వాత మహాప్రస్థానంలో అంతక్రియలు నిర్వహించారు.
ఇందిరా దేవికి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియో నుంచి ఆమె అంతిమయాత్రను కొనసాగించారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు కొనసాగిన ఈ అంతిమయాత్రలో టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఘట్టమనేని ఇందిరా దేవి గారికి ప్రత్యేకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మహేష్ బాబు కుమారుడిగా తన బాధ్యతను కూడా గౌరవప్రదంగా పూర్తి చేశాడు. తన తల్లికి సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించి కడసారి వీడ్కోలు పలికాడు మహేష్ బాబు.
ఆ కాడసారి కార్యక్రమం చివరి క్షణం వరకూ కూడా మహేష్ బాబు కంటతడి పెట్టుకున్నాడు.
ఇందిరా దేవి అనారోగ్యంతో:
ఇటీవల అనారోగ్యంతో ఇందిరా దేవి గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేరారు. అయితే ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ ఇంటికి వస్తారు అని కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో కోరుకున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చివరి నిమిషం వరకు వైద్యులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.