Samantha : why shakunthalam postpone again ? శాకుంతలం వయదా వేయడాకి కారణం ఏంటి ?

Samantha Dev Mohan

 

టాలీవుడ్, కొలివుడ్  స్టార్ హీరోయిన్ సమంతపాన్ – ఇండియా పాపులర్ కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతోంది. వరుస పెట్టి సినిమాలు, ఓ టి టి సిరిస్ లు  చేస్తున్న సమంత తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం.

గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చిత్రీకరణ చాలా రోజుల కిందటే పూర్తియింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇటీవల ఈ మూవీని నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో సమంత అభిమానులు సంబరపడిపోయారు. కానీ ఇంతలోనే  నిర్మాణ సంస్త అయినా శ్రీ వేంకటేశ్వర క్రియేసన్స్ అనుకొన్న డేట్ కి రిలీస్ చెయ్య లేకపోతున్నాము అని ఒక ప్రకటన విడుదల చేశారు.

sakunthalam update
ఎందుకు విడుదల చేయలేకపోతున్నాం అంటే: 

శాకుంతలం దర్శక నిర్మాతలు. ఈ సినిమాను అనుకున్నట్లుగా నవంబర్ 4న విడుదల చేయలేకపోతున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

 

”నవంబర్ 4 నాటికి ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కావడం లేదు. అలాగే ఈ మూవీని 3D ఫార్మాట్ లో విడుదల చేయనున్నాం. అందుకే 3D పనులకు మరికొంత సమయం అవసరం ఉంది. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం. మరో కొత్త తేదిని త్వరలో ప్రకటిస్తాం” అని అధికారికంగా అనౌన్స్ చేశారు svc వారు.

samantha shakuntalam1

సమంత  పౌరాణిక పాత్రలో మొదటిసారిగా నటిస్తుంది:

సమంత అభిమానులకు మూవీ వాయిదా పడటం బ్యాడ్ న్యూసా లేక  చిత్రం 3Dలో రావడం గుడ్ న్యూసా అని  తెలియడం కష్టంగా ఉంది.

ఈ మూవీలో సమంత మొదటిసారిగా పౌరాణిక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా యాక్ట్ చేశాడు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో గుర్రపు స్వారీ చేస్తున్న రాజుగా, మనోహరంగా ఉన్నాడు దేవ్ మోహన్. అలాగే మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను దిల్ రాజు విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో సమంత, దేవ్ మోహన్ చాలా రొమాంటిక్ గా కనిపించారు.

dev 1
బాల్య భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ:

శాకుంతలం చిత్రంలోబాల్య  భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

shakunthalam11

ఈ చిత్రంలో ఇంకా డయలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో మెరవనున్నారు.

పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న  శాకుంతలం చిత్రం గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *