Nene Vasthunna Review: ధనుష్ నటన సెల్వరాఘవన్ డైరక్షన్ వేరే లెవెల్

dhanush2

నటీనటులు: ధనుష్, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్, యోగిబాబు తదితరులు

రచన: ధనుష్, సెల్వరాఘవన్

దర్శకత్వం: సెల్వరాఘవన్

నిర్మాత: కలైపులి ఎస్ థాను

సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్

ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్

మ్యూజిక్: యువన్ శంకర్ రాజా

బ్యానర్: వీ క్రియేషన్స్

రిలీజ్ డేట్: 2022-09-29
ధనుష్ 4

నేనే వస్తున్నా కథ కధనం ఏంటో చూద్దామా ?

లాజిస్టిక్  కంపెనీలో ఉద్యోగి అయిన ప్రభు (ధనుష్) తన భార్య భువన (ఇందుజా రవిచంద్రన్), కూతురు సత్యతో ఆనందంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు.

ఫామిలి తో ఉత్తర భారతంలో సాంబ్రా ప్రాంత విహార యాత్ర చేసిన తర్వాత కూతురు సత్య మానసిక పరిస్థితి ఒకరకంగా మారిపోతుంది.

తనలో తాను మాట్లాడుకోవడం, నిద్రలేమి సమస్యల తో  సత్య భాద పడుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ద తగ్గిన సత్య ను  సైక్రియాటిస్ట్ (ప్రభు)తీసుకు వెళ్తే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు.

సత్య నార్మల్ కాకపోవడం తో సోషల్ మీడియా పారానార్మల్ యాక్టివిటీ స్టూడెంట్స్ ద్వారా సత్య ను  ఏదో ఆత్మ వెంటాడుతుందని విషయం తెలుస్తుంది.
ధనుష్ 2

సత్యను ఆత్మ ఎందుకు వెంటాడుతుంది?

ప్రభు (దనుష్త) కవల  సోదరుడు కదిర్ (ధనుష్)కు ఎందుకు దూరమయ్యాడు?

కదీర్‌ (దనుష్)  సొంత భార్య, పిల్లలతో   ఎందుకు గొడవ పడతాడు? 

కదీర్‌ నుంచి భార్య, పిల్లలు  ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తారు?

 కదీర్ వేట గాడిగా ఎందుకు మారాడు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే  నేనే వస్తున్నా మూవీ తప్పక చూడాలి.

ధనుష్ 1

మొదటి అంకం (ఫస్టాఫ్‌) ఎలా ఉందో చూద్దామా?

నేనే వస్తున్నా ( నానే వరువీన్ ) సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా.  చనిపోయిన ఓ వ్యక్తి.. తన మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకొనేందుకు మరో వ్యక్తి శరీరంలోకి ఆత్మగా  ప్రవేశించి పగ తీర్చుకోవాడమే  నేను వస్తున్నా సినిమా ప్లాట్.

ఫస్టాఫ్‌లో ప్రభు ఫామిలీ లో ఏర్పడిన సమస్యను ఆసక్తికరంగా దర్శకుడు సెల్వరాఘవన్  చిత్రీకరించాడు. ఫస్టాఫ్‌లో ప్రభు, సత్య మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా.. తల్లి తండ్రుల గుండెను పిండేసేలా ఉంటాయి.

ఇలాంటి ఎమోషనల్ జర్నీ ఓ మంచి ట్విస్టుతో ప్రథమార్థం  ముగుస్తుంది.

ధనుష్ 9

రెండవ అంకం (సెకండ్ హాఫ్ ) పరిశీలిస్తే :

ఇక సెకండాఫ్‌లో ప్రభు సోదరుడు కదీర్ ఫ్యామిలీలో పరిచయం తో అక్కడి పరిస్తితుల  ఆధారంగా సినిమా కథ ముందుకు సాగుతుంది.

విచిత్ర హావభావాలు, సమస్యపై తీవ్రంగా స్పందించే లక్షణాలు ఉన్న కదీర్ తనకు ఎదురైన అనుభవానికి పగ తీర్చుకోవడం తో కథా స్వరూపం మారిపోతుంది.

ధనుష్ 5

అయితే సత్యను ఆవహించిన ఆత్మ ఏమి చేసింది?

అనే విషయంతో కథ ముగుస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్నఎమోషన్  డ్రామా సెకండాఫ్‌లో కనిపించదు. సెకండాఫ్‌లో  ధనుష్ అగ్రెసివ్ క్యారెక్టర్ కొంత ఆసక్తిగా తర్వాత ఏమి జరుగుతుందా అనెల చాలా గ్రిప్పింగ్ తో సీన్స్ రాయడం వలన ధనుష్ లోని నటుడు బయటికి వచ్చాడు.

ధనుష్ ప్రభు, కదీర్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. ప్రభు ఫ్యామిలీ మ్యాన్‌గా నటిస్తే.. కదీర్ పాత్ర సీరియస్ గా  సాగుతుంది. రెండు పాత్రల్లో ఎప్పటిలానే ధనుష్ తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు.

ప్రభు క్యారెక్టర్ లో  ఎమోషన్ ఉంటే.. కదీర్ పాత్ర క్రూరత్వం  కనిపిస్తుంది. ఈ రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ ధనుష్ నట విశ్వ రూపం చూపించాడు.

Nene Vastunna MovieReview by 18 f

సినిమాటోగ్రఫి, మ్యూజిక్,సాంకేతిక విభాగాల విషయానికి చూస్తే: 

నేనే వస్తున్నా సినిమాకు ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫి యువన్ మ్యూజిక్ బలమైన అంశాలుగా మారాయి. ఓం ప్రకాశ్ అందించిన సినిమాటోగ్రఫి సినిమా మూడ్‌ను ఎమోషనల్‌గా మార్చింది.

ఒక సీరియస్ కంటెంట్‌ను, సైకలాజికల్ థ్రిల్లర్‌ను తెర మీద చెప్పడానికి వాడుకొన్న డార్క్ షేడ్  లైటింగ్ బాగుంది. ఇక యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది.

ఎడిటింగ్  షార్ప్ గా ఉంది. నిర్మాత కలైపులి థాను అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను మరింత కొత్తగా రిచ్‌గా మార్చాయి.
nene vasthunna3

నేనే వస్తున్నా  ఒవెరల్ గా ఎలా ఉందంటే?

నేనే వస్తున్నా సినిమా ఫామిలీ ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్. ధనుష్ నటన, సెల్వ రాఘవన్ టేకింగ్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫి, యువన్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

కాకపోతే  కథ, కథనాల హాలీ వుడ్  ఇంగ్షీషు సినిమా ఫార్మాట్ లో అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్లో, సెకండ్ హాఫ్ అంతా డెంట్ ఫారెస్ట్ లో తీయడం వలన సగటు సినీ ప్రేక్షకుడికి ఏదోల ఉంటుంది.

కవలపిల్లలైన ప్రభు, కదీర్ మద్య గొడవపడి  విడిపోయారనే విషయాన్ని మరింత డిటైల్‌గా చెప్పి ఉంటే అందరికీ  కనెక్టివ్‌గా ఉండేది.

ఫస్టాఫ్‌లో ఉన్న భావోద్వేగాన్ని సెకండాఫ్‌లో కొనసాగించడంలో సెల్వరాఘవన్ తడ బడ్డార ఆనిపిస్తుంది. సెకండాఫ్‌ సడెన్‌గా  ముగిసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ వారం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పుష్కలంగా అందించే సినిమా పోనీయం సెల్వం ఉండుట వలన  నేనే వస్తున్నా ఎంత వరకూ కలెక్ట్ చేస్తుండే చూడాలి .

ఈ సినిమా లో కూడా ధనుష్ మనల్ని నిరాశపరచడు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే హాలీ వుడ్ సినిమా అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది.

d 2

18F Opinion: సైకో త్రిల్లర్స్ ఇస్తపడే వారికి సెల్వ – దనుష్ ల ట్రీట్ నేనే వస్తున్నా …

-కృష్ణా ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *